న్యూఢిల్లీ, జనవరి 25: విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని వెల్లడించారు.