న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రముఖ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా సమర్పించారు. అధికారిక స్పీకర్ ఫార్మాట్‌కు కట్టుబడి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్(Jagdeep Dhankhar)కు రాజీనామా లేఖను అందజేశారు. రాజ్యసభ సభ్యత్వానికి(Rajya Sabha membership) రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామాను ఉపరాష్ట్రపతి(Vice President Jagdeep Dhankhar) ఆమోదించారని పేర్కొన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని విజయసాయి రెడ్డి భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు.
''నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు'' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్(Kakinada Port) వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న ఆయన.. తాను దేవుడిని నమ్మాను.. నమ్మక ద్రోహం చేయనని వివరించారు. తన లాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా జగన్‌కు ప్రజాధరణ తగ్గదని చెప్పారు. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం అన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరని విజయసాయిరెడ్డి(Venumbaka Vijayasai Reddy) సూచించారు. నాకు కాకినాడు సీపోర్టు విషయంలో ఏరోజు నాకు ఎవరూ చెప్పలేదు. కేసు పెట్టిన తర్వాతే నాకు కూడా విషయాలన్నీ తెలిశాయని వివరించారు. విక్రాంత్ రెడ్డితో నాకు పరిచయం చాలా తక్కువన్నారు. ఎక్కడైనా కనపడితే పలకరించేవాణ్ని.. అంతే అన్నారు. విక్రాంత్ రెడ్డి నాకన్న ఎక్కవ పరిచయాలు ఉన్న వ్యక్తి కేవీ రావు అన్నారు.
నాకు ఏ వ్యాపారాలు లేవు.. నేను పూర్తిగా పార్టీకోసమే పనిచేశానని తెలిపారు. నాకు ఏ వ్యాపారాలు లేవు.. దేంట్లోనూ భాగస్వామిగా లేనని తేల్చిచెప్పారు. కొన్ని పత్రికలు, ఛానళ్లలో కాకినాడ సీపోర్టు విషయంలోనే రాజీనామా చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడు సీపోర్టు కేసు పెట్టారని తెలిపారు. నాకు లుకౌట్ నోటీసు(Look Out Notice) ఇచ్చారు.. ఏ2గా చేశారు. ఇంతవరకు సీఐడీ వాళ్లు పిలవలేదు. ఈడీ(Enforcement Directorate) పిలిచినప్పుడు వెంకన్న సాక్షిగా కేవీ రావు అనే వ్యక్తితో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నాపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్పానని తెలిపారు. కేవీ రావు చెప్పేది నిజమైతే ఆయన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పమనండన్నారు. నేను నిజంగా విక్రాంత్ రెడ్డి ఆయన వద్దకు పంపించానన్న విషయంపై ప్రమాణం చేయమనండని విజయసాయి రెడ్డి సవాల్ చేశారు.