calender_icon.png 25 January, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్‌బై

25-01-2025 01:50:23 AM

  1. నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
  2. చంద్రబాబుతో విభేదాలు లేవు, పవన్ మిత్రుడు
  3. ఎక్స్‌లో స్పష్టీకరణ

అమరావతి, జనవరి 24: వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పాలిటిక్స్ నుంచి తప్పుకు న్నారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్వీట్‌లో ‘భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరను. వేరే పదవులు ఆశించి పదవికి రాజీనామా చేయడం లేదు.

నా నిర్ణయం పై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నాలుగు దశాబ్దాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నా’ అని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యస భలో ఫ్లోర్ లీడర్‌గా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోంస శక్తివంచన లేకుండా పనిచేశానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ లు లేవన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహముందని స్పష్టం చేశారు.