calender_icon.png 5 January, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌చే విజయక్రాంతి పేపర్ క్యాలెండర్ ఆవిష్కరణ

02-01-2025 11:26:14 PM

కామారెడ్డి (విజయక్రాంతి): విజయక్రాంతి నూతన సంవత్సర కాల్యెండర్ 2025ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయక్రాంతి పత్రికరంగంలో రాణించి ప్రజల పక్షాన నిలుస్తూ చేదోడు వాదోడుగా ఉండాలని సూచించారు. సమస్యల పట్ల కీలకపాత్ర పోషించి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌వో, స్టాప్ రిపోర్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్కిలేషన్ మేనేజర్ రాజు, సీనియర్ రిపోర్టర్లు శంకర్, సంతోష్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.