వనపర్తి, జనవరి 4 (విజయక్రాంతి) : నిజాలను నిర్భయంగా రాస్తూ.. ప్రజాసమస్యలను వెలికి తీస్తూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ.. అనతికాలంలోనే విజయక్రాంతి పత్రిక ప్రజాదరణ పొందిందని రాష్ట్ర కో ఆపరేటివ్ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరుమల మహేష్ అన్నారు. వనపర్తి జిల్లా స్టాఫర్ రాము, ఉమ్మడి జిల్లా సర్క్యులేషన్ ఇంచార్జి కామరాజు, కె.బి.నరసింహతో కలిసి శనివారం ఆయన విజయక్రాంతి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.