calender_icon.png 25 October, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ బలపడదు : విజయ శాంతి

08-07-2024 10:29:11 PM

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత విజయ శాంతి విమర్శలు గుప్పించారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ ఉభయ రాష్ట్రా సమస్యల పరిష్కారానికి, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉన్నాయనే  అనుమానం కలుగుతోందని ఆమె తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు, మళ్లీ రాష్ట్రంలో టీడీపీని విస్తరిస్తుందని చేసిన ప్రకటనే ఇందకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణాలో టీడీపీ పార్టీ బలపడుతుందనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక్కడ టీడీపీ ఎప్పటికీ బలపడదు  గాని.. తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడనీకి కుట్రలు చేస్తే రెండు పార్టీలు మునిగి గల్లంతాయని హెచ్చరించారు.

అలా జరిగితే తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తిరిగి పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమని భవిష్యత్ వాస్తవమని విజయ శాంతి వెల్లడించారు. తెలంగాణ  రాష్ట్రంలా టీడీపీని తిరిగి బలపరుస్తం అని అనవలసిన అవసరం ఏమున్నది? అని ప్రశ్నించారు. వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలా కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నదని, మీ  నాయకులు ఎవరైనా  కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటదని విజయ శాంతి పేర్కొన్నారు.