న్యూఢిల్లీ, అక్టోబర్ 19: జాతీయా మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజ యకిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. ఆమెతో పాటు సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్‌ను కేంద్రం నియమించింది. వీరువురు ఈ పదవిలో మూడేళ్లపాటు ఉంటారు. ఎన్‌సీ డబ్ల్యూ 9వ చైర్‌పర్సన్‌గా నియమితులైన విజయ రహత్కర్.. పుణె వర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, హిస్టరీలో మాస్టర్స్ పూర్తిచేశారు.
2016 వర కు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. రహత్కర్ స్త్రీల సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. పోక్సో, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చర్యలు, మానవ అక్రమ రవాణాపై ఆమె బలంగా పోరాడారు. ఆమె కృషికి జాతీయ సాహిత్య మండలి నుంచి జాతీయ న్యాయ అవార్డు, సావిత్రిబాయిపూలే అవార్డులు వరించాయి.