calender_icon.png 7 January, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి

02-01-2025 01:36:46 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, వాస్తవ కథనాలను ప్రచురించి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు దోహదపడాలని భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) అన్నారు. గురువారం విజయ క్రాంతి నూతన సంవత్సర క్యాలెండర్(Vijaya Kranti New Year Calendar)ను తన ఛాంబర్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోనే వాయిస్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఏర్పాటైన విజయ క్రాంతి పత్రిక అనతి కాలంలోనే ప్రజల మన్ననలను పొందిందన్నారు. ప్రజా సమస్యలపై, అవినీతి అక్రమాలపై, దృష్టి సారించి కథనాలు ప్రచురించడంతో ప్రజాదారణ తప్పకుండా చూరగోంట అన్నారు.