నారాయణఖేడ్, జనవరి 18: నారాయణఖేడ్ లో జుకల్ శివారులో కల విజయ పాలకేంద్రం నిర్వాహకులు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. గత కొన్ని నెలలుగా పాల రైతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి విజయ డైరీ చైర్మన్ అనిత రెడ్డి తో మాట్లాడి పాల రైతుల బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో ఎమ్మెల్యేకు వారు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భూజిరెడ్డి, జీవన్ పాల్గొన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మూడు నాలుగు వార్డులలో వేసిన సి సి రోడ్లను ఎమ్మెల్యే స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్టర్, వైస్ చైర్మన్ దారం శంకర్ స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. నారాయణఖేడ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు ఖేడ్ మున్సిపాలిటీ అన్ని విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.