హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్ కేసులో విజయ్ మద్దూరి విచారణ ముగిసింది. నాలుగు గంటల పాటు పోలీసులు విజయ్ మద్దూరిను విచారించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి, డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో పోలీసులు విచారించారు. రాజ్ పాకాల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విజయ్ ను ప్రశ్నించారు. జన్వాడలోని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బావ రాజ్ పాకాల సొంత ఫామ్‌హౌస్ లో జరుగుతున్న పార్టీపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి హాజరైన 24 మందికి మాదకద్రవ్యాల పరీక్షను నిర్వహించగా, ఒక వ్యక్తి కొకైన్‌కు పాజిటివ్ పరీక్షించాడు. తనిఖీల్లో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మోకిల పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు కూడా జారీ చేసి విచారణకు పిలిచారు.