calender_icon.png 7 April, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్మిక కోసం విజయ్ దేవరకొండ పాట!

06-04-2025 12:15:33 AM

‘రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే.. మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..’ అంటూ మంచి లవ్ ఫీల్‌తో సాగుతోందీ పాట. ఈ పాట కోసం స్టార్ హీరో విజయ్ దేవరకొండ గొంతు సవరించుకోవడం విశేషం. ఆయన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాదతో కలిసి ఆలపించారు.

‘రేయి లోలోతుల’ అనే ఈ గీత సాహిత్యాన్ని రాకేందు మౌళి ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కోసం అందించగా, ఈ పాటలో వచ్చే కవిత్వాన్ని చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రాశారు. శనివారం రష్మిక మందన్న పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ టీజర్ సాంగ్‌ను, ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక చేతుల్లో గన్, కత్తితో ధైర్యవంతురాలిగా, శక్తిమంతంగా కనిపిస్తోంది.

రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ అందమైన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.