హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే ‘వీడీ 12’ మొదలు పెట్టేశాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక వార్త సినిమాకు సంబంధించి బయటకు వస్తూనే ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పలు సందర్భాల్లో వెల్లడించారు. దీంతో విజయ్ అభిమానులు సైతం సినిమా సక్సెస్‌పై గట్టి నమ్మకంతో ఉన్నారు.
అయితే ఈ సినిమా టైటిల్ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. తాజాగా నాగవంశీ అయితే దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని హింస పెట్టి మరీ టైటిల్‌ను లాక్ చేయించినట్టు తెలిపారు. త్వరలోనే టైటిల్ రివీల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి తొలి వారంలో టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం. అయితే టాలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం ఇప్పటికే ఒక టైటిల్ వైరల్ అవుతోంది. వీడీ 12కి మేకర్స్ ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారంటూ టాక్ నడుస్తోంది.