20-03-2025 04:05:51 PM
స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే ప్రమోట్ చేశా
నేను ప్రమోషన్ చేసిన కంపెనీలు చట్ట ప్రకారమే
ఏ ప్రకటన చేసినా.. లీగల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటా
A23 అనే సంస్థ రమ్మీ గేమ్కి బ్రాండ్ అంబాసిడర్గా చేశా
ఇల్లీగల్గా ఏ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్గా లేను: విజయ్ దేవరకొండ
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్(Betting Apps Promotion)పై హీరో విజయ్ దేవరకొండ(Hero Vijay Deverakonda) స్పందించారు. చట్టప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పారు. నేను ప్రమోషన్ చేసిన కంపెనీలు చట్ట ప్రకారమే ఉన్నాయని పేర్కొన్నారు. ఏ ప్రకటన చేసినా.. లీగల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాను.. A23 అనే సంస్థ రమ్మీ గేమ్కి బ్రాండ్ అంబాసిడర్గా చేశానని చెప్పిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గతేడాదే ఆ సంస్థతో ఉన్న ఒప్పందం ముగిసిందన్నారు. ఇల్లీగల్గా పని చేస్తున్న ఏ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్గా లేనని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా కొనసాగుతున్న బెట్టింగ్ యాప్స్ కుంభకోణంపై తెలంగాణ పోలీసులు(Telangana Police) దృష్టి సారించారు. ఇప్పటికే పదకొండు మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై అధికారులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా ప్రదీప్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు మరో 25 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో దగ్గుబాటి రానా(Rana Daggubati), విజయ్ దేవరకొండ సహా మొత్తం 25 మంది ప్రముఖ టాలీవుడ్ నటుల పేర్లు ఉన్నాయి.
జాబితాలో నటులు, యూట్యూబర్‌లు, ఇతర వినోద ప్రముఖులు ఉన్నారు. కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హన్మంత్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృతా చౌదరి, నాయని, పద్మాయ్, హర్ష, నేహా పఠన్, పద్మాయ్, నేహా పఠాన్ సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత్. టేస్టీ తేజ మంగళవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణ నిమిత్తం హాజరయ్యారు. యాంకర్ విష్ణుప్రియ(Anchor Vishnupriya) గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పరేషాన్ బాయ్స్‌కు చెందిన యూట్యూబర్లు హర్ష సాయి, ఇమ్రాన్ అరెస్టును నివారించడానికి దుబాయ్‌కు పారిపోయారని సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.