calender_icon.png 15 January, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగ్రామంలో విహాన్ అంత్యక్రియలు

18-07-2024 01:24:35 AM

జవహర్‌నగర్‌లో వీధికుక్కల దాడిలో 17  నెలల బాలుడి మృతి

గాంధీలో పోస్టుమార్టం అనంతరం మిరుదొడ్డికి తరలింపు 

బాధిత కుటుంబానికి జవహార్‌నగర్ మేయర్ రూ.50 వేల సాయం 

ప్రభుత్వానిదే బాధ్యతంటూ విపక్షాల ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో/సిద్దిపేట, జూలై 17 (విజయక్రాంతి): నగర శివారు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదర్శనగర్ కాలనీలో మంగళవా రం రాత్రి వీధి కుక్కుల దాడిలో చిన్నారి విహాన్ (17 నెలలు) మరణించడం హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. మృతుడు కనీసం రెండేళ్లు కూడా నిండని వాడు కావడంతో జవహర్‌నగర్ ప్రాంతమంతా విషాధ ఛాయలు అలుముకున్నారు. స్థానిక ఆదర్శనగర్ కాలనీలోని బాధిత కుటుంబానికి స్థానికులు సానుభూతి వ్యక్తం చేశారు.

మృతుడు విహాన్ తండ్రి పుల్లూరి భరత్‌కుమార్, తల్లి లక్ష్మీ రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం ఆదర్శనగర్ కాలనీకి మారారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో బంధువులతో మాట్లాడుతుండగా విహాన్ ఆడుకుంటూ ఇంటి బయటకు రావడంతో వీధి కుక్క లు దాడి చేసి కొంత దూరం లాక్కెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ సమయంలో విహాన్ మెదడులోని కొంతభాగం బయటకు వచ్చింది.

తక్షణమే గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచి ంచారు. దీంతో అంకుర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబుకు తీవ్రగాయాలు కావడం, మెదడులోని భాగం బయటకు రావడంతో గాంధీకి తీసుకెళ్లాలని రిఫర్ చేయడంతో రాత్రి 11 గంటలకు అక్కడికి వెళ్లా రు. గాంధీలో వైద్యం చేసేందుకు వైద్యులు, సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ విహాన్ రాత్రి 11 గంటల తర్వాత మృతిచెందాడు. 

10 ఏళ్లకు సంతానం... 

విహాన్ తండ్రి భరత్‌కుమార్, లక్ష్మీ దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం. వీరిలో విహాన్ చిన్నవాడు. ముందుగా అక్కలు సాహితీ, శృతి వరుసగా 11 ఏళ్లు, 10 ఏళ్లు  ఉంటాయి. అయితే, మగ పిల్లాడు కావాలని ఈ దంపతులు కోరుకున్నారు. 10 ఏళ్ల తర్వాత విహాన్ పుట్టడంతో వీరి కుటుంబంలో ఆనందానికి అవదుల్లేవు. కానీ, అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో విహాన్ మరణించడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. 

ప్రభుత్వానిదే బాధ్యత

జవహర్‌నగర్ మేయర్ దొంతగాని శాంతికోటేశ్‌గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల సాయం అందించారు. కార్పొరేషన్ పరిధిలో కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటనపై స్థానిక రాజకీయ పక్షాలు స్పందించాయి. విహాన్ మరణానికి ప్రభుత్వమే భాధ్యత వహించాలంటూ స్థానిక బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు బుధవారం ధర్నా చేపట్టారు. 

స్వగ్రామంలో అంత్యక్రియలు 

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మధ్యాహ్నం పోస్టుమార్టం ముగిసిన తర్వాత స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి విహాన్ మృతదేహం చేరుకుంది. బుధవారం సాయంత్రం విహాన్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియలకు మిరు ద్దొడ్డి గ్రామంతో పాటు సమీప గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బాలుడి మృతి పట్ల గ్రామ ంలో విషాదం అలుముకుంది. గ్రామాలలో సైతం వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడిన సందర్భాలను అక్కడి ప్రజలు గుర్తు చేసుకున్నారు.