calender_icon.png 27 February, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంతాన ప్రాప్తిరస్తు’లో విజ్ఞాన్ కుమార్

26-02-2025 10:48:52 PM

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా నుంచి జీవన్ కుమార్ నటించిన ఇంగ్లీష్ రాని ప్రాజెక్ట్ మేనేజర్ ‘విజ్ఞాన్ కుమార్’ క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విగ్ పెట్టుకునే విజ్ఞాన్ కుమార్ ఇంగ్లీష్ రాకున్నా ప్రాజెక్ట్ మేనేజర్‌గా తన టీమ్‌ను ఎలా లీడ్ చేశాడు? ఇలాంటి ప్రాజెక్ట్ మేనేజర్‌తో ఇతర సిబ్బంది ఎలాంటి పాట్లు పడ్డారు? అనేది ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాను సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.