calender_icon.png 25 November, 2024 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలి

11-11-2024 06:25:14 PM

ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.

ఏజెన్సీలో కమ్యూనిటీ పోలీసింగ్ ను ప్రోత్సహించాలని సూచన.

మణుగూరు: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని,గోదావరి తీర ప్రాంతాలలో మరింత నిఘా పెంచాలని, ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ ను ప్రోత్సహించాలని వరంగల్ మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన, స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన  సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజకుమార్ లను ఐజి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్ ను ప్రోత్సహిస్తూ ఏజెన్సీ గ్రామాల్లోని యువతను అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్లకుండా, గ్రామాలలో యువతకు వారి అభిరుచుల మేరకు విద్య ఉపాధి మార్గాల వైపు నడపాలని సూచించారు. కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వి.వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.