విచారణలో స్పీడ్ పెంచిన అధికారులు
హనుమకొండ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ విచారణలో స్పీడ్ పెంచి ంది. కొద్దిరోజుల కిందట యూనివర్సిటీని సందర్శించిన అధికారుల బృందం మంగళవారం మరోసారి విచారణ చేసింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ రాకేశ్ ఆధ్వర్యంలో 229 సర్వే నంబర్‌లోని భూముల వివరాలు సేకరించారు. ఈ సర్వేనంబ ర్‌లో 6.15 ఎకరాల భూమి సరిహద్దులో ప్రహరీని నిర్మించిన యాజ మానులను విచారించారు. మరో సర్వే నంబర్ 214లో సైతం సర్వే చేయాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్ రాకేశ్ తెలిపారు.
యూనివర్సిటీ భూము ల ఆక్రమణలపై విజిలెన్స్ విచారణ చేపట్టిన నేపథ్యంలో కబ్జాదా రుల్లో వణుకు మొదలైంది. కేయూ కు చెందిన కొంతమంది ఉద్యోగులతో కలిసి ఇతరులు సర్వే నంబర్ 229లోని భూమిని ఆక్రమించి ఇండ్లు నిర్మాణం చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఉపాధ్యాయ సంఘాలు సైతం ఇన్‌చార్జ్ వీసీ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశాయి. దీంతో యూనివర్సిటీలో కీలక పదవిలో కొనసాగుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ఆర్ట్స్ కళాశాలకు బదిలీ చేశారు.