calender_icon.png 20 April, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి పరిధిలో విజిలెన్స్ తనిఖీలు

12-04-2025 12:13:29 AM

పలు డివిజన్లలో నల్లాలకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (విజయక్రాంతి)  : జలమండలి పరిధిలోని పలు ఓఅండ్‌ఎం సెక్షన్లలో విజిలెన్స్ సిబ్బం ది శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. డివిజన్ నెంబర్ 2లోని మూసారాంబాగ్ రోడ్ నంబర్ 12, 13, 14 ప్రాంతాల్లో పలువురు వినియోగదారులు తమ నల్లాలకు అక్రమంగా బిగించిన 8మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా మోటార్లు బిగించి పట్టుబడితే జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మో టార్లు సీజ్ చేస్తామని, రెండోసారి మోటార్ బిగేసేత రూ.5వేల జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్ఛరించారు. కాగా నీటి సరఫరాలో సమస్యలు వచ్చినా, లో ప్రెజర్‌తో నీటి సరఫరా జరిగినా తమకు దగ్గర్లోని జలమండలి మేనేజర్, డీజీఎం, జీఎం, అధికారులను సంప్రదించాలని, తమ కస్టమర్ కేర్ నంబర్ 155313కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.