కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌పై విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసిన న్యాయవాదులను శనివారం విజిలెన్స్ అధికారులు విచారించారు. నాలుగు కుర్చీలు కొనివ్వనందున ఓ ఆర్టీసీ ఉద్యోగి పదవి విరమణ కార్యక్రమాన్ని డీఎం నిర్వహించలేదని విజిలెన్స్ అధికారులకు వివరించినట్లు సమాచారం. కాగా విజిలెన్స్ అధికారుల విచారణ నేపథ్యంలో కంట్రోలర్, కండక్టర్లు, డ్రైవర్లను డీఎం పిలుచుకొని తనకు వ్యతిరేకంగా అధికారుల ఎదుట చెప్పితే భవిష్యత్‌లో పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.