- ఆధారాలను సేకరించిన విజిలెన్స్ అధికారులు
- పలు ఫైళ్లు, వివరాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): టీజీఎస్ పీడీసీఎల్ హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఆజామాబాద్ డివిజన్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి ప్రశ్నలు వేసి వారి నుంచి పలు వివరాలు సేకరించారు.
ఆజా మాబాద్ డివిజన్ పరిధిలో టెంపరరీ సర్వీసుల మం జూ రు వ్యవహరంలో గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్ అధికారులు జేబులు నింపుకుంటూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న తీరుపై ‘విద్యుత్ శాఖలో ఇంటి దొంగలు’ పేరుతో విజయక్రాంతి గురువారం ప్రత్యేక కథనం ప్రచురించింది.
డివిజన్‌లోని రాంనగర్, ముషీరాబాద్ సెక్షన్లలో టెంపరరీ సర్వీసులను క్యాటగిరీ మంజూరు చేయాల్సిన విద్యుత్ మీటర్లను సదరు భవన నిర్మాణదారులతో కుమ్మక్కై క్యాటగిరీ 2 జాబితాలో చేర్చుతూ ఎస్‌పీడీఎస్‌ఎల్ సంస్థ ఆదాయానికి గండికొడుతున్న విషయాన్ని విజయక్రాంతి వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ కథనానికి స్పందించిన ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధం గా తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆదేశించడంతో విజిలెన్స్ అధికారు లు రంగంలోకి దిగి వీఎస్టీ సమీపంలోని ఆజామాబాద్ డివిజన్ (ఆపరేషన్) కార్యాల యానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు సెక్షన్లలోని కంప్యూటర్లు, ఫైళ్లను తనిఖీలు చేశారు. డివిజన్‌లోని పలు సెక్షన్లకు సంబంధించిన టెంపరరీ సర్వీసులపై ఆరా తీశారు.