calender_icon.png 1 March, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ సేవపై విజిలెన్స్ దాడులు

01-03-2025 12:10:59 AM

కరీంనగర్, ఫిబ్రవరి28(విజయక్రాంతి): కరీంనగర్ దుర్షేడ్ గ్రామంలో శ్రీరామ మీ సేవా  సెంటర్లో విజలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి.. జిల్లాలో 200కు పైగా మీసేవ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం .

.రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉండగా,నగదు రూపంలో చెల్లింపులు చేయడంపై అధికారులు ఆరా తీశారు .. వినియోగదారులను సైతం చెల్లింపులపై ఆరా తీశారు ..మీసేవ సెంటర్లలో అవకతవకల పై ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం..

గ్రామీణ ప్రాంతాలలో వినియో గదారులు ఆన్లున్ చెల్లింపులు చేయలేకపోవడంతో వారి వద్ద నుండి నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని మీసేవ సెంటర్ నిర్వాహకుడు అశోక్ తెలిపారు..అయితే మీ సేవా సెంటర్ నిర్వాహకుడు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది తో కుమ్ముకై పలు అక్రమ లావాదెవీలు జరిపనట్టుగా ఆరోపణలు ఉన్నాయి.