calender_icon.png 27 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపులపై విజిలెన్స్

22-07-2024 12:49:12 AM

  1. జీహెచ్‌ఎంసీ హెల్త్ సెక్షన్‌లో ఉద్యోగినిపై కాంట్రాక్టర్ వేధింపులు
  2. వేధింపులపై ఇంటర్నల్ కమిటీ విచారణ 
  3. డబ్బు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ పోస్టులలో నియామకాలు 
  4. అక్రమాలపై రంగంలోకి దిగిన విజిలెన్స్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై ౨౧ (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ హెల్త్ సెక్షన్‌లో రోజుకో రూపంలో అక్రమాలు, వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి కారణం మీరంటే.. కాదు మీరే అంటూ అధికారులు, కాంట్రాక్టర్లు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉద్యోగినిలపై వేధింపులు, డబ్బులు తీసుకొని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పోస్టులలో నియామకాలకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ నిర్ధారణకు వచ్చిన అధికారులు అసలు నిజాలు కనిపెట్టేందుకు విజిలెన్స్ విభాగానికి అప్పగించినట్టుగా విశ్వసనీయ సమాచారం. 

వేధింపుల నుంచి లావాదేవీల దాకా.. 

జీహెచ్‌ఎంసీ హెల్త్ సెక్షన్‌లో జరుగుతు న్న ఈ వేధింపులు, అక్రమాలపై విజయక్రాంతి పత్రిక ఏప్రిల్ 23న ‘బల్దియాలో కీచక కాంట్రాక్టర్’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనికంటే ముందుగా బాధితురాలు ఏప్రిల్ 20న ఆనాటి కమిషనర్ రోనాల్డ్ రోస్‌కు ఫిర్యాదు చేసింది. విజయక్రాంతిలో ప్రచురితమైన కథనం, బాధితు రాలి ఫిర్యాదు ఆధారంగా మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన సదరు కాంట్రా క్టర్‌పై ఇంటర్ కంప్లుట్సై కమిటీ (ఐసీసీ) విచారణ జరిపింది.

వేధింపులపై విచారణ చేసిన ఈ కమిటీ ముందు బాధిత ఉద్యోగిని నుంచి సంబంధిత సెక్షన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.50 వేల మొత్తాన్ని తీసుకున్న ట్టుగా అధికారుల దృష్టికి కాంట్రాక్టర్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఏజెన్సీలో పనిచేసే సిబ్బంది నుంచి సెక్షన్ ఉద్యోగులు లంచం తీసుకుంటే నేనెందుకు జీతం ఇవ్వాలనే వాదనను సదరు కాంట్రాక్ట ర్ తెరపైకి తెస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో వీరి వాదోపవా దనలు ఎలా ఉన్నా.. బాధిత ఉద్యోగినికి మాత్రం కాంట్రాక్టర్ 6 నెలలుగా వేతనం చెల్లించడం లేదనే విషయాన్ని అధికారులే ధ్రువీకరిస్తున్నారు. 

కమిషనర్ బదిలీతో పార్టీ?

ఇదే సెక్షన్‌లో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ‘కేసులు పెట్టారు.. రికవరీ మరిచారు’ అనే శీర్షికన ఏప్రిల్ 20న విజయ క్రాం తి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన అప్పటి కమిషనర్ రోనాల్డ్ రోస్ బోగస్ సర్టిఫికెట్ల రికవరీ విషయంపై ప్రత్యేక ఫైల్ తయారు చేసినట్టుగా తెలిసింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవడానికి కమిషనర్ వద్దకు ఫైల్ చేరగానే 15 రోజులు సెల వుపై వెళ్లడం, ఆపై బదిలీ కావడం తెల్సిందే. దీంతో సర్టిఫికెట్ల రికవరీ విషయంలో తమపై కచ్చితంగా చర్యలు ఉంటాయని భావించిన సంబంధిత సర్కిల్ సిబ్బంది, ఆ సెక్షన్ అధికారితో కలిసి పార్టీ చేసుకున్నట్టుగా సమాచారం. ఈ పార్టీకి ఓ ఉన్నతాధికారి కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది.

6 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా.. 

జీహెచ్‌ఎంసీ హెల్త్ సెక్షన్‌లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేసుకునే ఉద్యోగినిలపై సదరు కాంట్రాక్టర్ కన్నేస్తున్నట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై బాధితురాలు కమిషనర్‌కు ఫిర్యాదులోనూ వివరించారు. సెక్షన్ సిబ్బంది ద్వారా ఒకరు జెంట్, మరొకరు మహిళా సిబ్బంది నియామకమైనట్టుగా తెలుస్తోంది. వీరిద్దరిలో సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ మహిళ ఉద్యోగిని లోబర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన ట్టుగా తెలుస్తోంది.

ఆ ప్రయత్నాలన్ని బెడిసి కొట్టడంతో 6 నెలలుగా వేతనం నిలిపివేస్తున్నట్టుగా సమాచారం. సదరు కాంట్రాక్టర్ జెంట్ సిబ్బందికి ప్రతినెలా వేతనం చెల్లిస్తూ, మహిళా ఉద్యోగికి మాత్రమే వేతనం ఇవ్వడం లేదనే విష యం బల్దియా కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ అధికారిని ప్రశ్నిం చగా, అతడికి పెద్ద స్థాయిలో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావిం చారు. అందుకే 20 ఏళ్లుగా బల్దియాలో తిష్ట వేసుకొని ఉన్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా ఈ దఫా ఆ ఏజెన్సీ పేరును బ్లాక్ లిస్టులో పెడతామంటూ చెప్పుకొచ్చారు.