మంచిర్యాల, నవంబర్4 (విజయక్రాంతి): గవర్నమెంట్ ఆఫ్ ఇండి యా, సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జపాన్‌లో నిర్వహించే ‘సకు రా సైన్స్ ఎక్సేంజ్ ప్రోగ్రాంకు మంచిర్యాల కస్తూర్భా బాలికల పాఠశాల విద్యార్థిని ఎంపికైంది. మంచిర్యాల కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న విద్యాసింగ్ ఈ నెల 10 నుంచి 16 వరకు జపాన్‌లో జరిగే సైన్స్ ఎక్సేంజ్‌లో పాల్గొననుంది. విద్యార్థి ప్ర యాణ, వసతి ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఇతర ఖర్చుల నిమిత్తం ప్రవీణ్‌కుమార్ రూ.5 వేలు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు రూ.2 వేలు, కేజీబీవీ ఎస్ఓ స్వప్న రూ.2 వేలను కలెక్టర్ కమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈఓ యాదయ్య అందజేశారు.