హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ముంబై నటి కాదంబరీ జైత్వానీ కేసులో డెహ్రాడూన్‌లో అరెస్టయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు విజయవాడకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. సోమవారం విద్యాసాగర్‌ను కోర్టులో హాజరుపరుస్తాని చెప్పారు. దీంతో విద్యాసాగర్‌పై రిమాండ్ రిపోర్డ్‌ను రూపొందించే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. అనుమానమున్నవారిని విచారిస్తున్నారు.