డా. సత్తు లింగమూర్తి :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం విద్యారంగంలో ఉన్నత ప్రమాణాల నిర్మాణానికి మార్గాన్ని రూపొందిస్తున్నారు. దీనిలో 2014 నుండి పలు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు పలు అవకాశాలు అందిస్తున్నారు.
భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక యువతను కలిగిన దేశం. ఈ యువతరమే దేశానికి బలం. అందువల్ల భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం రూపొందించబడింది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ ఉన్నత చదువులు ఆపకూడదనేది ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఈనెల 6న అంగీకారం తెలిపిం ది, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే చైర్మన్.
పెరిగిపోతున్న ఖర్చులు
ప్రస్తుత కాలంలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. హైస్కూలు, ఇంటర్మీడియట్ వరకు ఎలాగోలా చదువుకోగలిగినా ఆపై చదువులు చాలామంది చదవలేకపోతున్నారు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలన్నా అందుకు ఎన్నో పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రుణం మంజూరు కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. ఇంత చేసినా రుణం వస్తుందో రాదో కూడా తెలియదు.
ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఇంటివద్దనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది. అదే పీఎం విద్యాలక్ష్మి పథకం. విద్యార్థులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా విద్యా రుణాలను అందించేందుకు భారత చరిత్రలో మొదలుపెట్టిన తొలి పథకం ప్రధాన మంత్రి విద్యాలక్ష్మిపథకం. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందగలరు.
ఆర్థిక ఇబ్బందులతో చదువు ముందుకు కొనసాగించలేని ఎవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ పథకం కింద 13 బ్యాంకులు లిస్ట్ అయ్యాయి. ఇవి 22 రకాల విద్యారుణాలు అందిస్తాయి.10+2 పరీక్షలో ఉత్తీర్ణులయిన ఎవరైనా ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల్లో చదవాలనుకునే వారికి రూ.7.5 లక్షల దాకా రుణం లభిస్తుంది.
విదేశాల్లో చదవాలనుకుంటే రూ.15 క్షల వరకు లోన్ లభిస్తుంది. దీని లక్ష్యం ప్రతి విద్యార్థికి విద్య కోసం ఆర్థిక సాయం అందించడమే. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) ప్రకారం భారత దేశం విద్యారంగంలో ప్రగతిని సాధించడంలో, విద్య అందరికీ అందుబాటులో ఉండేటట్లు బహుళ ప్రణాళికలను తెచ్చింది. ఈ విద్యా విధానం భారత యువతను విద్యకు అతి చేరువ చేయడానికి శక్తివంతమైన మార్గదర్శిని.
నూతన విద్యా విధానం లక్ష్యాలు
విద్యావ్యవస్థలో భిన్నాంశాలను కలుపుకోవడంతో పాటుగా ఆధునికతను చేర్చు కోవడం ఈ విధానానికి ప్రధాన లక్ష్యం. దీని ప్రకారం, నూతన విధానాలను అమలుచేయడం ద్వారా, సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యమవుతుంది. పేద,వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇప్పటివరకు 860 కేంద్రాల్లో మొ త్తం రుణాల ద్వారా విద్యార్థులు సబ్సిడీ ఆన్‌లైన్ ప్రక్రియలో చేర్చబడ్డారు.ఈ విధానం అంతర్జాతీయ విద్యాసంస్థలలో భారతీయ విద్యార్థులకు మద్దతుగా నడుస్తుంది. 20 లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పటికే దీనిలో చేరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం విద్యారంగంలో ఉన్నత ప్రమాణాల నిర్మాణానికి మార్గాన్ని రూపొంది స్తున్నారు. దీనిలో 2014 నుండి పలు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు పలు అవకాశాలు అందిస్తున్నారు.
విద్యాలక్ష్మి పథకం ముఖ్యాంశాలు
భారతదేశంలోని 860కు పైగా ఉత్తమ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు, గ్యారంటీ లేకుండా, భద్రతా డిపాజి ట్ అవసరం లేకుండా విద్యా రుణాలు అందించబడతాయి. రుణానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ ద్వారా సులభతరం చేయబడుతుంది. ఇది పూర్తిగా విద్యార్థి స్నేహపూర్వకంగా ఉంటుంది.
రూ. 7.5 లక్షల వరకు రుణం తీసుకునే విద్యార్థులకు 75 శాతం క్రెడిట్ గ్యారంటీ అందించబడుతుంది, దీని ద్వారా బ్యాంకులు విద్యార్థులకు రుణం ఇవ్వడంలో సహాయపడతాయి. రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయంతో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ఇతర ప్రభుత్వ పథకాల కింద అర్హత లేకపోతే, రూ. 10 లక్షల వరకు రుణం తీసుకునే సమయంలో మూడు శాతం వడ్డీ రాయితీ పొందగలరు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం లక్షమంది విద్యార్థులు లబ్ధి పొందగలరని అంచనా. ప్రాధాన్యతగా ప్రభుత్వ విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన విద్యార్థులు,సాంకేతిక,వృత్తి కోర్సులు ఎంచుకున్న విద్యార్థులు ఈ వడ్డీ రాయితీ పొందగలరు.
కేటాయింపులు
ఈ పథకానికి రూ. 3,600 కోట్లు 2024-25 నుండి 2030-31 మధ్య కేటాయించబడ్డాయి. ఏటా 7 లక్షల మంది విద్యార్థులు కొత్తగా ఈ వడ్డీ సబ్వెన్షన్ పొందవచ్చు. మొత్తం 7 లక్షల మంది విద్యార్థులు ఈ వడ్డీ రయితీ ప్రయోజనం పొందుతారని అంచనా. విద్యార్థులు ‘పీఎం -విద్యాలక్ష్మి’ అనే యూనిఫైడ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, ఇందులో రుణం మరియు వడ్డీ సబ్వెన్షన్ కోసం ఒకే దరఖాస్తు విధానం అందుబాటులో ఉంటుంది. ఈ-వౌచర్ ,సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (జీబీడీసీ) వాలెట్ ద్వారా వడ్డీ సబ్వెన్షన్ చెల్లించబడుతుంది.
మరో కీలక పథకం
సీఎం-యూఎస్‌పీ కింద, అనుమతి పొందిన విద్యాసంస్థలలో సాంకేతిక,వృత్తి కోర్సులు చదివే విద్యార్థులకు, వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల లోపు ఉంటే, రూ. 10 లక్షల వరకు రుణం తీసుకునే సమయంలో పూర్తి వడ్డీ సబ్వెన్షన్ అందించబడుతుంది. పీఎం విద్యాలక్ష్మీ మరియు పీఎంయూఎస్‌పీ కలిసి ప్రతి విద్యారిక్థి ఉన్నత విద్యను అందించడానికి సహాయపడతాయి.ఈ పథకం ప్రధానంగా భారత దేశ యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో ఒక గొప్ప చర్యగా నిలుస్తుంది.