* సెల్‌ఫోన్‌ను గుర్తించిన విద్యార్థినులు
* పోలీసుల అదుపులో వీడియో తీసిన విద్యార్థి
* మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన
మహబూబ్‌నగర్, జనవరి 4 (విజయక్రాంతి): బాలికల బాత్‌రూంలలో సెల్‌ఫో ఉంచి వీడియోలు తీసిన ఘటన మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చోటు చేసుకుంది. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల బాత్‌రూంలో ఓ విద్యార్థి సెల్‌ఫోన్ ఉంచి వీడియో రికార్డు చేశాడు. బాత్‌రూంలోని దృశ్యాలు రికార్డు అవుతున్నట్లు గుర్తించిన ఓ విద్యార్థిని తోటి విద్యార్థినులతో కలిసి కళాశాల అధ్యపకులకు సమాచారం అందించారు.
అధ్యా?పకులు బాత్‌రూంలోని సెల్‌ఫోన్‌ను తీసుకుని, అందులోని ఏటీఎం కార్డు ద్వారా విద్యార్థి ఎవరో తెలుసుకున్నారు. పోలీస్‌లకు సమాచారం అందించారు. అయితే సదరు విద్యార్థి సెల్‌ఫోన్ పోయిందని కళాశాల అధ్యపకులకు ఫిర్యాదు చేయడంతో వీడియో రికార్డు చేసింది అతనేని గుర్తించారు. ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌లో రికార్డులకు సంబంధించి భరోసా కేంద్రంలో ఆ ఫోన్‌ను ఉంచారు. బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కాగా వీడియోలు తీసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు.