11-03-2025 12:00:00 AM
రాజమౌళి బాబు కాంబోలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి రాజమౌళి ముందుగానే చాలా నిబంధనలు పెట్టారని సమాచారం. దానికి అనుగుణంగానే ఎవరూ కూడా సెల్‌ఫోన్స్ సెట్‌లోకి తీసుకురావడం నిషేధం. అంత స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా ఏదో ఒక లీక్ ఎలాగోలా బయటకు వస్తూనే ఉంటుంది.
తాజాగా అదే జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ లీకైన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. వీల్ చైర్‌లో పృథ్వీరాజ్ కూర్చొని ఉంటాడు.
మహేశ్ ని పృథ్వీ ముందు మోకాళ్లపై కూర్చోబెడతారు. ఈ వీడియోపై చర్చ బీభత్సంగానే నెట్టింట జరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు కథను ఊహించుకుంటున్నారు. మరోవైపు ఈ లీకైన వీడియోపై మేకర్స్.. ముఖ్యంగా రాజమౌళి చాలా సీరియస్ అయ్యారట. దీనిపై చర్యలు తీసుకునేందుకు సైతం సిద్ధమవుతున్నారని టాక్.