calender_icon.png 12 February, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఠాణాకు వచ్చిన యువతితో వీడియో కాల్స్!

12-02-2025 12:00:00 AM

  1. నార్సింగి డీఐపై వేటు 
  2. ఐజీ కార్యాలయానికి అటాచ్ 

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 11: రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని నార్సింగి డీఐగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఇటీవల మస్తాన్ సాయి కేసుతోపాటు సినీనటుడు రాజ్‌తరుణ్ కేసులో ఓ యువతి తరచూ నార్సింగి ఠాణాకు వచ్చింది.

డీఐగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌తో ఆమె పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత విషయాలు చర్చించుకునే స్థాయికి వెళ్లారు. ఇద్దరి మధ్య, ఆడియో, వీడియో కాల్స్ కూడా నడిచాయి. ఓ ఆడియో కాల్‌లో కవ్వించేలా సంభాషణ కొనసాగింది. ఈ విషయం సోషల్ మీడియోలో వైరల్‌గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

డీఐ శ్రీనివాస్‌ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రెండుమూడు రోజుల క్రితమే డీఐపై చర్యలు తీసుకున్నా ఈ విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. కాగా డీఐతో సదరు యువతి సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. డీఐ అండతోనే సదరు యువతి మస్తాన్ సాయిపై కేసు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.