calender_icon.png 5 February, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియురాలికి వీడియో కాల్.. ఆపై ఆత్మహత్య

05-02-2025 12:15:47 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): తన లవర్ కు వాట్సాప్ వీడియో కాల్(WhatsApp video call) చేసి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్(suicide Raidurgam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన వర్మ ప్రధాన్ ( 28 ) అపర్ణ కన్స్ట్రక్షన్స్ లో షిఫ్ట్ సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు కలహాలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

మంగళవారం రాత్రి వర్మ ప్రధాన్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి తాను ఉంటున్న అద్దె గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం ప్రేమ వ్యవహారమేనని భావిస్తున్నారు.