calender_icon.png 17 January, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో విదర్భ

17-01-2025 12:00:00 AM

విజయ్ హజారే ట్రోఫీ

వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం మహారాష్ట్రతో జరిగిన రెండో సెమీస్‌లో విదర్భ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసింది.

ఓపెనర్లు ధ్రువ్ షోరే (114), యశ్ రాథోడ్ (116) సెంచరీలతో వీరవిహారం చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చతికిలపడిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (90) టాప్ స్కోరర్. విదర్భ బౌలర్లలో దర్శన్, నచికేత్ చెరో 3 వికెట్లతో మెరిశారు. శనివారం జరగనున్న ఫైనల్లో కర్ణాటక, విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి.