విజయ్ హజారే ట్రోఫీ
వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ, హర్యానా జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం గుజరాత్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో హర్యానా 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54) అర్థసెంచరీతో రాణించాడు. హర్యానా బౌలర్లలో అనూజ్, నిషాంత్ సింధు చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం హర్యానా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ హిమాన్షు (66) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయి 4 వికెట్లతో మెరిశాడు. ఇక రెండో క్వార్టర్స్‌లో విదర్భ జట్టు 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత రాజస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం విదర్భ 43.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేధించింది.
ధ్రువ్ షోరే (118 నాటౌట్), కెప్టెన్ కరుణ్ నాయర్ (122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగారు. కాగా కరుణ్ నాయర్‌కు టోర్నీలో ఐదోది కాగా వరుసగా నాలుగో శతకం సాధించాడు. తద్వారా నారయన్ జగదీశన్ (2021 తర్వాత ఐదు సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.