calender_icon.png 21 January, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్‌పై విజయం

20-09-2024 12:00:00 AM

45వ చెస్ ఒలింపియాడ్

బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు జోరు చూపిస్తున్నారు. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లు పాల్గొన్న గేమ్‌లో ఒక్క ప్రజ్ఞానంద తప్ప ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. ఇప్పటికే జరిగిన ఏడు రౌండ్లలో సత్తా చాటిన భారత గ్రాండ్ మాస్టర్లు ఇరాన్ ఆటగాళ్లకు కూడా చెమటలు పట్టించారు. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.