నార్వే: ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద విజయంతో ముగించాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పదో రౌండ్‌లో ప్రజ్ఞానంద అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకామురాకు షాక్ ఇచ్చాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 14.5 పాయింట్లతో టోర్నీని మూడోస్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో మాగ్నస్ కార్ల్‌సన్, ఫాబియానో కరునాలను క్లాసికల్ గేమ్స్‌లో ఓడించాడు.
తాజాగా నకామురాపై గెలుపుతో ఒక టోర్నీలో టాప్ ప్లేయర్లను మట్టికరిపించిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద నిలిచాడు. ప్రపంచ నెంబర్‌వన్, స్థానిక ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచాడు. పదో రౌండ్‌లో కరునాను ఓడించిన కార్ల్‌సన్ 17.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద చేతిలో ఓడినప్పటికీ నకామురా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో వెన్‌జున్ జూ విజేతగా నిలిచింది.