న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా ఐదో రౌండ్ మ్యాచ్‌ల్లో భాగంగా మేఘాలయతో మ్యాచ్‌ను బరోడా రెండు రోజుల్లోనే ముగించింది. మ్యాచ్‌ను బరోడా ఇన్నింగ్స్ 261 పరుగులతో విజయం సాధించింది. గురువారం జరిగిన పలు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కారు.
ఒడిషాలో స్వస్తిక్ సమల్ (107), చత్తీస్‌గఢ్‌లో ఆయుష్ పాండే (108*), జార్ఖండ్‌లో కుమార్ కుశాగ్ర (133*) శతకాలు బాదారు. ఇక ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ (300 నాటౌట్) ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కగా.. కార్తిక్ శర్మ శతకంతో మెరిశాడు.