23-04-2025 01:42:06 AM
అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాం తి): రాష్ర్ట ప్రభుత్వం ముందుచూపుతో ప్రారంభించిన రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం సత్ఫలితాన్నిచ్చింది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో సివిల్స్ తుది ఫలితాల్లో ఏడుగురు అభ్యర్థులు సత్తాచాటారు. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఏడుగురు తెలంగాణ యువతీ, యువకులు ఎంపిక కావడం విశేషం.
ఇందులో దేశవ్యాప్తంగా 11వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి ర్యాంకు సాధించిన సాయిశివాని కూడా ఉన్నారు. అలాగే హరిప్రసాద్ పోతరాజు (255వ ర్యాంకు), ప్రీతి రాపర్తి (451వ ర్యాంకు), నాగరాజ నాయక్ బానోత్ (697వ ర్యాం కు), తొగరు సూర్యతేజ (799వ ర్యాంకు), ఆంజనేయులు గోకమల్ల (934వ ర్యాంకు), రామటెంకి సుధాకర్ (949వ ర్యాంకు) ఉన్నారు. మాక్ ఇంటర్వ్యూలను గతంలో నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కర్ణాటకకు చెందిన ప్రీతి(263వ ర్యాంక్), మహారాష్ర్టకు చెందిన రాజు వాఫ్‌ు (871వ ర్యాంక్) సాధించడం విశేషం. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ప్రోత్సాహకం అందుకున్న యువత సత్తా చాటడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. యువత తమ లక్ష్యాల సాధనలోనే నిమగ్నంకావాలన్నారు.