calender_icon.png 25 November, 2024 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయోత్సవ పండుగ

25-11-2024 02:17:30 AM

  1. 9 రోజులపాటు ప్రజాపాలన సంబురాలు 
  2. రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
  3. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం
  4. వచ్చే నెల 1 నుంచి 9 వరకు ప్రణాళికలు సిద్ధం

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 1 నుంచి 9 వరకు నిర్వహించే వేడుకలు.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అధి కారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విజయోత్స వాల్లో అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వా లని సూచించారు. ఆ దిశగానే అధికార యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. తొమ్మిది రోజులపా టు ఏ రోజు ఏం చేయాలో.. వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

శాఖల వారీగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం సంబంధిత మంత్రుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతోపాటు విజయోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

* రోజుల కార్యక్రమాలు ఇలా.. 

* రాష్ర్టంలో ౨౬ నియోజకవర్గాలకు కొత్తగా మంజూరైన ౨౬ ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమిపూజ నిర్వహిస్తారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి.  

* డిసెంబర్ ఒకటి నుంచి 7 వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు.

* వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు కొత్తగా 213 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తారు.

* ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాకో ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. విజయోత్సవాల్లో భాగంగా ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ వలంటీర్లుగా నియమిస్తారు.

* హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లను విజయోత్సవాల్లో చేపడుతారు. 

* గోషామహల్‌లో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమిపూజ చేస్తారు. 

* ఆరంఘర్ జూపార్క్ ఫ్లు ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఆరు ఎస్టీపీలను కూడా ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లు ఓవర్లు, అండర్ పాస్‌లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతారు. 

* హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో  ఇందిరా శక్తి మహిళా బజార్‌ను ప్రారంభిస్తారు.

* తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అటవీ పర్యాటక శాఖల అధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్ల ప్రారంభం.

* ఘట్‌కేస్కర్‌లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ఏర్పాటు. మల్లేపల్లి, మేడ్చల్, నల్లగొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. 

* దామరచర్లలో యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల ఒక యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. రాష్ర్టంలో వివిధ ప్రాంతాల్లో 237 సబ్‌స్టేషన్ల ప్రారంభం.

* యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతుల ప్రారంభం. స్పోర్ట్ యూనివర్సిటీకి భూమిపూజ ఉంటుంది. ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ అధ్వర్యంలో ఏఐ సిటీ ఏర్పాట్లతో పాటు పలు ఒప్పందాలు ఉంటాయి. 

* రాష్ర్టంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహణ. అన్ని స్థాయిల్లోని విద్యార్థులు ఈ వేడుకలు జరుపుకొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు.