calender_icon.png 26 November, 2024 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ హామీ నిలబెట్టుకున్నరని విజయోత్సవాలు?

25-11-2024 11:50:17 PM

బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జునరెడ్డి

హుస్నాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతుందని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన హుస్నాబాద్ లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల మైండ్ ను డైవర్టు చేస్తోందన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు.

అప్పు ఉన్న ప్రతి రైతు ఖాతాలో రూ.2లక్షలు వేయాల్సింది పోయి, ఏవేవో కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. కనీసం రైతు భరోసా కూడా ఇవ్వలేదన్నారు. తెల్లారి లేస్తే బీఆర్ఎస్ ను విమర్శించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఇప్పటికైనా ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  ఆ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, నియోజకవర్గ అధికార ప్రతినిధి సుద్దాల చంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి పర్శరాములు పాల్గొన్నారు.