calender_icon.png 14 January, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి

01-12-2024 12:16:36 AM

  1. 593 మంది కార్మికులకు నియామక పత్రాలు
  2. 4న సీఎం చేతుల మీదుగా అందజేత
  3. సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాలను సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ అధికారులను ఆదేశించారు. విజయోత్సవాల నిర్వహణపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

ఏడాది కాలంలో 2,165 కొత్త ఉద్యోగాలను కల్పించామని, 33 శాతం లాభాల వాటా బోనస్‌ను కార్మికులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 4న పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 9వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారని..

అందులో సింగరేణికి సంబంధించి 593 మందికి అపాయింట్ ఆర్డర్లు అందిస్తారని  తెలిపారు. ప్రభుత్వ సహకారంతో కొత్త గనులను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో డైరెక్టర్ జీ.వెంకటేశ్వర్ రెడ్డి, జీఎం ఎస్‌డీ ఎం.సుభాని, జీఎం రవిప్రసాద్ పాల్గొన్నారు. 

క్యూఆర్ కోడ్‌తో సింగరేణి సమాచారం..

సింగరేణికి సంబంధించిన ప్రగతి, సంక్షేమం సమాచారం ఎప్పటికప్పుడు కార్మికులకు, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల క్యూఆర్ కోడ్‌లను సీఎండీ బలరామ్ ఆవిష్కరించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్‌ఇన్‌లలో సింగరేణి సమాచారాన్ని తెలుసుకోవచ్చని సీఎండీ తెలిపారు.

ఈ కోడ్‌లను గనులు, కార్యాలయాలు, వివిధ శాఖల్లో ఉంచుతామని.. కార్మికులు, స్థానికులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సింగరేణి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను అనుసరించాలని సూచించారు.