calender_icon.png 29 November, 2024 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

29-11-2024 07:13:00 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లా అధికారులతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలను డిసెంబర్ 1 నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. డిసెంబరు 1వ తేదీన విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేయాలని, సి.ఎం. కప్ ఆటల పోటీల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

2వ తేదీన జిల్లాలో ట్రాన్స్ జెండర్స్ కొరకు క్లినిక్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని, 3వ తేదీన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాలను విద్యుత్ దీప కాంతులతో అలంకరించాలని, వైద్య పరీక్షలు, కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు, పి.పి.ఈ. ఇట్లు పంపిణీ చేయాలని, మున్సిపల్ పరిధిలో సంవత్సరంలో చేపట్టిన పనుల జాబితా ప్రదర్శించాలని తెలిపారు. 4వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో జిల్లాలో గ్రూప్-4 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 5వ తేదీన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కేంద్రాల వద్ద, 6వ తేదీన జిల్లాలో గృహజ్యోతి ద్వారా జీరో కరెంటు బిల్లులపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

7వ తేదీన మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో ప్రజా పాలన విజయోత్సవాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, 8వ తేదీన వివిధ శాఖల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని, 9వ తేదీన హైదరాబాద్ లో జరిగే ప్రజా బహిరంగ సభలో జిల్లా నుండి 2 వేల మందిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కార్యాలయంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా లోగోలు ఉంచాలని, సంవత్సరంలో సాధించిన లక్ష్యాలు, చేపట్టిన పనుల నివేదికలను శనివారంలోగా శాఖల వారీగా ముఖ్య ప్రణాళిక అధికారికి అందించాలని తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.