calender_icon.png 24 November, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు

24-11-2024 07:19:52 PM

మునుగోడు (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలను నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అన్నారు. మండల అధికారుల ఆధ్వర్యంలో మునుగోడు, కొరటికల్, పలివెల గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ.. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు మునుముందు ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రానున్న రోజులలో అభివృద్ధి పనులతో పాటు, మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో తాహసిల్దార్ నరేందర్, ఇన్చార్జ్ ఎంపీడీవో విజయభాస్కర్, సెక్రెటరీ మానస, ఆనగంటి కృష్ణ, పుష్ప వీరేశం, గ్రామస్తులు ఉన్నారు.