08-02-2025 06:57:46 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అనంతరం మోదీకి గజమాల వేసి సత్కరించారు.