calender_icon.png 26 December, 2024 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్‌ఆర్సీకి ‘సున్నంచెరువు’ బాధితులు

12-09-2024 12:26:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): తాము హైదరాబాద్‌లోని మాదాపూర్ సున్నంచెరువు ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని, తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వకుండానే హైడ్రా గుడిసెలను కూల్చివేసిందని బాధితులు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు వెంటనే రాష్ట్రప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబాలు 15 ఏళ్ల నుంచి సున్నం చెరువు ప్రాంతంలో  ఉంటున్నాయన్నారు.  నష్టపోయిన పేదలకు  సర్కార్ నుంచి పరిహారం ఇప్పించాలని, బాధితులపై పోలీసులు నమో దు చేసిన కేసులను ఉపసంహరించేలా చూడాలన్నారు.