మాజీ మంత్రి సత్యవతితో కలిసి నేడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): లగచర్ల ఫార్మా బాధితు లు న్యాయ పోరాటం ఉద్ధృతం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం అరాచక కాండపై ఇప్పటికే రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిష న్‌కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి వెళ్లిన వారు సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఉదయం 11గంటల నుంచి 2 గంటల మధ్య కలవనున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్, పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. కొడంగల్‌లోని ప్రభుత్వ పెద్ద అన్నదమ్ముల అరాచకాలను, వారి ప్రైవేట్ సైన్యం వికృతంగా ప్రవర్తించిన తీరును వివరించనున్నారు.
నేడు ఢిల్లీకి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం చేసే అరా చకాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమ వారం ఢిల్లీ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. లగచర్ల బాధితుల సమ స్యలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలవనున్నట్టు చెప్పారు. మధ్యా హ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో రేవంత్ పాలనపై మాట్లాడనున్నారు.