06-04-2025 12:07:24 AM
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ జోరు మీదున్నాడు. ఇటీవల చరిత్రాత్మక చిత్రం ‘ఛావా’తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన మరో సినిమాను ప్రకటించారు. రాబోయే సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో మంత్రముగ్దుల్ని చేయనున్నారు. ప్రఖ్యాత చిత్ర నిర్మాత సుజీత్ సిర్కార్ దర్శకత్వంలో ‘ఏక్ జాదూగర్’ అనే సినిమా రూపొందుతోంది.
రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్.. మాంత్రికుడిలా మాయలు చేసే ఇంద్రజాలకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని విక్కీ ఫస్ట్‌లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.