calender_icon.png 27 December, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఉప రాష్ట్రపతి పర్యటన

27-12-2024 03:02:08 AM

జగదీప్ ధన్‌ఖడ్‌కు వీడ్కోలు పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: తెలంగాణలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రెండు రోజుల పర్యటన ముగియడంతో గురువారం ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భం గా ఉపరాష్ట్రపతి దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి మం త్రి జూపల్లి జ్ఞాపికను అందజేశారు. వీడ్కోలు పలికిన వారిలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రొటోకాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకట్రావు, డీజీపీ జితేందర్, రంగారెడ్డి కలెక్టర్ సీ నారాయణరెడ్డి ఉన్నారు.