10-03-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మార్చి 9: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అస్వస్థతతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆదివారం ఆయన ఛాతీ నొప్పితో బాధపడ్డారు. దీంతో తెల్లవారుజామున 2 గంటలకు ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్‌ఖర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో చికిత్స పొందుతున్న ధన్‌ఖర్ ఆరోగ్య పరిస్థితిని కొంత మంది వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది.
అయితే ధనఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ ఎయిమ్స్‌కు వెళ్లి ధన్‌ఖర్‌ను పరామర్శించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వ్యుదులను అడిగి తెలుసుకున్నారు. ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా దేవున్ని ప్రార్థించారు. మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నాడ్డా కూడా ఎయిమ్స్‌కు వెళ్లి, ఉప రాష్ట్రపతిని పరామర్శించారు.