హైదరాబాద్: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రెండు రోజుల తెలంగాణ పర్యటనకు బయలుదేరనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. న పర్యటన సందర్భంగా మెదక్, హైదరాబాద్‌లలో ధన్‌ఖడ్ పర్యటిస్తారని ఉపరాష్ట్రపతి సచివాలయం మంగళవారం తెలిపింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌లో జరిగే సహజ, సేంద్రియ రైతుల సదస్సుకు ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరకానున్నారు. ఐసీఏఆర్ లో 500 మంది రైతులతో ఆయన ముఖాముఖిలో పాల్గొనున్నారు.