01-03-2025 01:05:09 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఐఐటీని సందర్శించి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.
ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షా సమా వేశం నిర్వహించారు. అన్ని శాఖలు స మన్వయంతో పనిచేస్తూ తగిన ఏర్పా ట్లు చేయాలని సూచించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌శాఖకు సీఎస్ సూచించారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ సీఎస్ రవిగుప్తా, ఆర్‌అండ్‌బీ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, పొలిటి కల్ సెక్రటరీ రఘునందన్‌రావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.