హైదరాబాద్,(విజయక్రాంతి): ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మెదక్, హైదరాబాద్‌లో ధన్‌ఖడ్ పర్యటిస్తారని రాష్ట్రపతి సచివాలయం ముందుగానే తెలిపింది. బ్లాక్ బుక్ ప్రకారం రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లు ఉపరాష్ట్రపతి కార్యాలయంతో, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని పకడ్పందిగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వైస్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌లో జరిగే సహజ, సేంద్రియ రైతుల సదస్సుకు ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరకానున్నారు. ఐసీఏఆర్ లో సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఆయన ముఖాముఖిలో పాల్గొంటారు.