calender_icon.png 9 March, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి ధంఖర్

09-03-2025 10:40:17 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Vice President Jagdeep Dhankhar) ఆదివారం తెల్లవారుజామున ఛాతీ నొప్పి, అసౌకర్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌(Delhi AIIMS)లో చేరారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన ధన్ ఖడ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డా.రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో ఉన్నారు.